Hindupur: హిందూపురంలో మంజునాథ్ ఆత్మీయ భేటీ: బలిజల మద్దతు
Hindupur: హిందూపురం మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థి పోరిడి మంజునాథ్ బలిజ కులస్తులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే బాలకృష్ణ సహకారంతో అభివృద్ధి చేస్తానని తెలిపారు.
Hindupur: హిందూపురంలో మంజునాథ్ ఆత్మీయ భేటీ: బలిజల మద్దతు
శ్రీ సత్య సాయి జిల్లా: హిందూపురం మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థి పోరిడి మంజునాథ్ స్థానిక లక్ష్మీపురం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణమంటపంలో బలిజ కులస్తులతో సమావేశం నిర్వహించారు. నాపై ఎంతో నమ్మకం ఉంచి హిందూపురం మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా బరి లోకి దింపిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మంజునాథ్. నన్ను ఆశీర్వదించండి ఎమ్మెల్యే బాలయ్య సహకారంతో హిందూపురం మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేంద్ర, శ్రీనివాసరావు, బాలాజీ, బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి లావణ్య, బలిజకుల సంఘం పెద్దలు పాల్గొన్నారు.




