Anantapur: ఎన్నికల తీరుపై ఈసీని ఆశ్రయిస్తామన్న మాజీ మంత్రి!

Anantapur: అనంతపురం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 29 Nov 2026 1:00 PM IST
Anantapur
X

Anantapur: ఎన్నికల తీరుపై ఈసీని ఆశ్రయిస్తామన్న మాజీ మంత్రి! 

Anantapur: అనంతపురం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైసీపీ సింగనమల నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఆయన నివాసం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.అయితే సింగనమల నియోజకవర్గంలో మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పర్యటించడంపై సాకే శైలజనాథ్ ప్రశ్నించారు.

ఎన్నికలు పూర్తిగా న్యాయబద్ధంగా, పారదర్శకంగా జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలను సంఘటిత పద్ధతిలో నిర్వహించడం ప్రభుత్వానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు.ఎన్నికల నిర్వహణ తీరుపై ఎలక్షన్ కమిషన్‌ను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఆధిపత్యం కొనసాగిందని సాకే శైలజానాథ్ పేర్కొన్నారు.మొత్తానికి రెండో విడత పంచాయతీ ఎన్నికల వేళ సాకే శైలజానాథ్ హౌస్ అరెస్ట్ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM