Penukonda: పెద్దకొనేటి నాయకుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సవిత

Penukonda: పెనుగొండలో రాజరాజశ్రీ రాయుదలవాయి పెద్దకొనేటి నాయకుడి విగ్రహాన్ని మంత్రి సవిత ఘనంగా ఆవిష్కరించారు. ఆయన చారిత్రక సేవలను కొనియాడారు.

K.UDAY BHANU, PENUKONDA
Published on: 2 Oct 2026 10:26 PM IST
Penukonda
X

Penukonda: పెద్దకొనేటి నాయకుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సవిత

పెనుకొండ: పెనుకొండ ఆర్చ్ వద్ద జియో మెగా పాల్యం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో BJVPS సహకారంతో ఏర్పాటు చేసిన రాజరాజశ్రీ రాయుదలవాయి పెద్దకొనేటి నాయకుడి విగ్రహాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి సవితమ్మ ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, పెనుకొండ ప్రాంతానికి చివరి పరిపాలకుడిగా పెద్దకొనేటి నాయకుడు అందించిన సేవలు, ఆయన చరిత్ర, ప్రజలతో ఉన్న అనుబంధం చిరస్మరణీయమని అన్నారు. పెనుకొండ చారిత్రక వైభవంలో పెద్దకొనేటి నాయకుడి పాత్ర ప్రత్యేకమైనదని, ఆయన సేవలను భావితరాలకు పరిచయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

చారిత్రక వ్యక్తుల స్ఫూర్తిని నేటి తరాలకు అందించేందుకు వారి విగ్రహాలను ఏర్పాటు చేయడం ఎంతో ముఖ్యమన్నారు. పెనుకొండకు ఉన్న చారిత్రక ప్రాధాన్యతను కాపాడుతూ, పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు.

పెద్దకొనేటి నాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన జియో మెగా పాల్యం ఫౌండేషన్ నిర్వాహకులను మంత్రి సవిత అభినందించారు. చారిత్రక వారసత్వాన్ని కాపాడేందుకు ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు BJVPS కమిటీ సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

K.UDAY BHANU, PENUKONDA

K.UDAY BHANU, PENUKONDA