Anantapur: అనంతపురం 30వ డివిజన్లో ప్రశాంతంగా రీపోలింగ్!
Anantapur: అనంతపురం 30వ డివిజన్ 3వ బూత్‌లో ముమ్మరంగా రీపోలింగ్. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు, పరిశీలించిన మేయర్ అభ్యర్థులు.
Anantapur: అనంతపురం 30వ డివిజన్లో ప్రశాంతంగా రీపోలింగ్!
Anantapur: అనంతపురంలోని 30 డివిజన్ మూడవ పోలింగ్ బూతులు రీపోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. భారీ పోలీసు బందోబస్తు నడుమ రీపోలింగ్ ప్రారంభమైంది. నిన్నటి రోజున కొంతమంది బయటి వ్యక్తులు పోలింగ్ కేంద్రంలోనికి ప్రవేశించి రిగ్గింగ్ కు పాల్పడ్డారు. ఇందులో బిజెపికి చెందిన వ్యక్తులతో పాటు వైసిపికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
రిగ్గింగ్ కి పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేసి తరలించారు. ఇరు పార్టీల నాయకులు ఈ విషయంపై జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఆనంద్ కి ఫిర్యాదు చేశారు. దీంతో రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ఇవాళ ఉదయం 7 ఏడు గంటల నుంచి భారీ పోలీసు బందోబస్తు నడుమ రీపోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
30వ డివిజన్ పరిధిలో మొత్తం 3923 ఓట్లు ఉండగా మూడవ భూతు పరిధిలో 973 ఓట్లు ఉన్నాయి. 973 ఓట్లకు సంబంధించి రీపోలింగ్ ప్రక్రియ ప్రస్తుతం సజావుగా సాగుతోంది. ఈ పోలింగ్ ప్రక్రియను బిజెపి మేయర్ అభ్యర్థి అజేష్ బాబు, అలాగే వైసిపి మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ దగ్గరుండి పరిశీలించారు. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు నడుమ రీపోలింగ్ సజావుగా జరిగేలా చూస్తున్నారు.




