Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ చైర్మన్గా పరిటాల శ్రీరామ్ పేరు ఖరారు!
Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ చైర్మన్గా టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం.
Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ చైర్మన్గా పరిటాల శ్రీరామ్ పేరు ఖరారు!
Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ చైర్మన్గా పరిటాల శ్రీరామ్ పేరు ఖరారు అయినట్లు విశ్వసినీయ సమాచారం వచ్చినట్లు రాజకీయ వర్గాలు తెలిపాయి.
జడ్పీ చైర్మన్ రేసులో జనసేన నాయకుడు పుట్టపర్తి జెడ్పీటీసీగా విజయం సాధించిన చిలకం మధుసూదన్ రెడ్డి ఉన్నా కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పరిటాల పేరే సూచించినట్లు తెలిసింది.
2024లో ధర్మవరం శాసనసభ స్థానం సీటు ఆశించి బంగపడ్డ పరిటాల శ్రీరామ్ అధిష్టానం ఆదేశాల మేరకు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ ని గెలిపించారు.
అనంతరం తెలుగుదేశం పార్టీ తరఫున కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ పదవుల్లోనూ పరిటాల శ్రీరామ్ కు న్యాయం జరగలేదని ఆయన అభిమానుల్లో నిరాశ అలముకొంది.
ఇప్పుడు జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో నల్లచెరువు మండలం నుంచి జడ్పీటీసీగా పరిటాల శ్రీరామ్ నామినేషన్ వేసి విజయం సాధించారు.
జడ్పీచైర్మన్ గా అవకాశం ఇస్తామని టీడీపీ అధిష్టానం హామీ ఇవ్వడంతోనే జడ్పీటీసీగా నామినేషన్ వేసినట్లు ఆయన అభిమానులు టీడీపీ శ్రేణులు అంటున్నారు.
ఇప్పుడు మళ్లీ పరిటాల శ్రీరామ్ ని కాదని వేరే వారికి అవకాశం ఇస్తే పరిటాల అభిమానులు టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకునే అవకాశం ఉండదని అధిష్టానం గ్రహించి సత్య సాయి జిల్లా తొలి జడ్పీచైర్మన్గా పరిటాల శ్రీరామ్ పేరును దాదాపు ఖరారు చేసినట్లు రాజధాని అమరావతి లో ఉన్న అత్యంత రాజకీయ ప్రముఖలు సైతం బయటికి లీక్ చేసినట్లు తెలిసింది.




