Nallacheruvu: నల్లచెరువు జడ్పీటీసీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ నామినేషన్ దాఖలు!

Nallacheruvu: శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు జడ్పీటీసీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ అనూహ్యంగా నామినేషన్ దాఖలు చేశారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 23 Oct 2026 2:34 PM IST
Nallacheruvu
X

Nallacheruvu: నల్లచెరువు జడ్పీటీసీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ నామినేషన్ దాఖలు!

Nallacheruvu: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు జడ్పీటీసీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం కొత్తచెరువులోని శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఎలాంటి హడావుడి లేకుండా అనూహ్యంగా నామినేషన్ దాఖలు చేసిన పరిటాల శ్రీరామ్ వెంట కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం.ఎస్. రాజు ఉన్నారు. నల్లచెరువు జడ్పీటీసీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ నామినేషన్ దాఖలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI