Pamidi: వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి ఆసుపత్రిలో పరామర్శించిన నేతలు
Pamidi: పామిడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త మహేష్‌రెడ్డిపై దాడిని ఖండిస్తూ నాయకులు ఆసుపత్రిలో పరామర్శించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్.
Pamidi: వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి ఆసుపత్రిలో పరామర్శించిన నేతలు
పామిడి: పామిడి పట్టణానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త మహేష్‌రెడ్డిపై గుర్తుతెలియని దుండగులు మాస్కులు ధరించి కారులో వచ్చి దాడి చేసిన ఘటనపై వైఎస్సార్‌సీపీ నాయకులు స్పందించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మహేష్‌రెడ్డిని చికిత్స నిమిత్తం అనంతపురం పట్టణంలోని ఆనంద్ ఆసుపత్రిలో చేర్పించగా, అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై. వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ శివరాం రెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వారు పామిడి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సీఐతో మాట్లాడారు. మాస్కులు ధరించి కారులో వచ్చి మహేష్‌రెడ్డిపై దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. పామిడి పట్టణంలో ప్రశాంత వాతావరణం కొనసాగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇలాంటి ఘటనలు పునరావృతమైతే వైఎస్సార్‌సీపీ తరఫున తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నాయకులు హెచ్చరించారు. దాడికి పాల్పడిన వారిని త్వరగా గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఆర్గనైజర్ కార్యదర్శి చెన్నకేశవరెడ్డి, జిల్లా యువ నాయకుడు వాల్మీకి సూరి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి మురళి నాయక్, పామిడి పట్టణ, మండల అధ్యక్షులు ఈశ్వర్‌రెడ్డి, రామకృష్ణ నాయక్, సీనియర్ నాయకులు పాల్యం నారాయణరెడ్డి, రామచంద్ర, సాకే ఓబులేసు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




