Pamidi: పామిడి ప్రభుత్వ స్కూల్లో ఘనంగా ‘వికసిత్ భారత్’ పెయింటింగ్ పోటీలు
Pamidi: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా పామిడి టి.సి. ప్రభుత్వ హైస్కూల్లో ‘వికసిత్ భారత్’ చిత్రలేఖన పోటీలు నిర్వహించి విజేతలకు జ్ఞాపికలు అందజేశారు.
Pamidi: పామిడి ప్రభుత్వ స్కూల్లో ఘనంగా ‘వికసిత్ భారత్’ పెయింటింగ్ పోటీలు
పామిడి: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పామిడి బీజేపీ మండల అధ్యక్షులు చౌహాన్ అంజినాయక్ ఆధ్వర్యంలో స్థానిక టి.సి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా ‘25 కోట్ల చిన్నారుల కలల చిత్రలేఖన–వికసిత్ భారత్’ అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామ్‌కుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల్లో సుమారు 80 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను చాటుకున్నారు. కార్యక్రమానికి పామిడి తహసీల్దార్ షర్మిల ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. చిన్నారుల ఆలోచనలకు సృజనాత్మక రూపం ఇచ్చేందుకు ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు జ్ఞాపికలు అందజేశారు.
అదే వేదికపై జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ తైక్వాండో పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన రాచేపల్లి మనోజ్ను బీజేపీ నాయకులు, అధికారులు శాలువాతో ఘనంగా సన్మానించారు. పామిడి ప్రాంతానికి పేరు తీసుకొచ్చిన మనోజ్‌ను అభినందించారు. మనోజ్‌కు శిక్షణ అందించి విజేతగా తీర్చిదిద్దిన తైక్వాండో మాస్టర్ తలారి తులసీరామ్ను కూడా అధికారులు, బీజేపీ నాయకులు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఎం.కె. కుమారస్వామి, మండల ఉపాధ్యక్షులు సుందరయ్య, మల్లికార్జున చారి, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యురాలు పూజాలక్ష్మీదేవి, ఓబీసీ ఉపాధ్యక్షులు మనోజ్‌కుమార్, నరేష్ యాదవ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




