Guntakal: జితేంద్ర గౌడ్, యశోదను కలిసిన పామిడి టీడీపీ శ్రేణులు
Guntakal: గుంతకల్లు మున్సిపల్ చైర్మన్ యశోద గౌడ్, మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, పవన్ గౌడ్‌ను పామిడి టీడీపీ శ్రేణులు కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
Guntakal: జితేంద్ర గౌడ్, యశోదను కలిసిన పామిడి టీడీపీ శ్రేణులు
గుంతకల్లు: గుంతకల్లు మున్సిపల్ చైర్మన్‌గా అఖండ మెజార్టీతో విజయం సాధించిన యశోద గౌడ్‌కు పామిడి పట్టణ టీడీపీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే రామగౌని జితేంద్ర గౌడ్ నివాసంలో ఆయనను, మున్సిపల్ చైర్మన్ యశోద గౌడ్‌ను, యువనేత పవన్ గౌడ్‌ను పామిడి టీడీపీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా యశోద గౌడ్‌ను శాలువాతో సత్కరించి ఘన విజయంపై అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పామిడి పట్టణ టీడీపీ నాయకులు వై.యు. రామాంజినేయులు, జింకల రామకృష్ణ, సూరి, మస్తాన్, దూదు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




