Pamidi: రామగిరి ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థిగా రమావత్ సోనమ్మ నామినేషన్!
Pamidi: అనంతపురం జిల్లా పామిడి మండలం రామగిరి ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా రమావత్ సోనమ్మ నామినేషన్ దాఖలు చేశారు. గ్రామాభివృద్ధే ధ్యేయమని స్పష్టం చేశారు.
Pamidi: రామగిరి ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థిగా రమావత్ సోనమ్మ నామినేషన్!
పామిడి: అనంతపురం జిల్లా పామిడి మండలం రామగిరి ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రమావత్ సోనమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఆమె భర్త రమావత్ లక్ష్మణ్ నాయక్.
ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని అభ్యర్థి తెలిపారు. గ్రామాల్లో తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రామగిరి గ్రామానికి చెందిన సర్పంచ్ చెరువు సుదర్శన్, బాబు, ఆనంద్ బాబు, రామగిరి ఎగువ తండాకు చెందిన లక్ష్మణ్ నాయక్, స్వామి నాయక్, శ్రీకుమార్ నాయక్, విజయ భాస్కర్ నాయక్, దిబ్బసానిపల్లి గ్రామానికి చెందిన చంద్రతో పాటు పలువురు గ్రామ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




