Pamidi: తైక్వాండోలో రాచేపల్లి మనోజ్ మెరుపులు.. గోల్డ్ మెడల్ కైవసం
Pamidi: తాడిపత్రిలో జరిగిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో పామిడికి చెందిన రాచేపల్లి మనోజ్ స్వర్ణం సాధించి 70వ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
Pamidi: తైక్వాండోలో రాచేపల్లి మనోజ్ మెరుపులు.. గోల్డ్ మెడల్ కైవసం
పామిడి: తాడిపత్రిలో నిర్వహించిన జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ తైక్వాండో పోటీల్లో పామిడి పట్టణానికి చెందిన రాచేపల్లి మనోజ్ ప్రతిభ చాటాడు. శ్రీ చైతన్య పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న మనోజ్, బ్రూస్లీ తైక్వాండో అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.
అండర్-14 బాలుర 21 కేజీల లోపు విభాగంలో జరిగిన పోటీల్లో మనోజ్ ప్రత్యర్థులపై మెరుపు వేగంతో కిక్స్ చేస్తూ అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకాన్ని సాధించాడు. ఈ విజయంతో ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు తాడిపత్రిలో నిర్వహించనున్న 70వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ పోటీలకు మనోజ్ ఎంపికయ్యాడు.
జిల్లాస్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన మనోజ్‌ను, అతనికి శిక్షణ అందించిన కోచ్ తలారి తులసీరామ్‌ను పామిడి శ్రీ చైతన్య విద్యాసంస్థల ఎండీ సంతోష్ రెడ్డి అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి పామిడికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.




