Pamidi: వ్యాలీ గ్రీన్ గార్మెంట్స్‌లో వైభవంగా దసరా నవరాత్రి వేడుకలు!

Pamidi: పామిడి గజరాంపల్లి వ్యాలీ గ్రీన్ గార్మెంట్స్‌లో దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. లక్కీ డ్రా ద్వారా ఉద్యోగులకు అమ్మవారి చీరల పంపిణీ.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 14 Oct 2026 9:59 PM IST
Pamidi
X

Pamidi: వ్యాలీ గ్రీన్ గార్మెంట్స్‌లో వైభవంగా దసరా నవరాత్రి వేడుకలు!

పామిడి: దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని గజరాంపల్లి గ్రామంలోని వ్యాలీ గ్రీన్ గార్మెంట్ పరిశ్రమలో నవరాత్రుల వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. పరిశ్రమ అధినేత్రి పెరుమాళ్ల మమతారెడ్డి ఆధ్వర్యంలో, సంస్థ అధినేత, పీజేఆర్ ట్రస్ట్ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు పెరుమాళ్ల జీవానందరెడ్డి సూచనల మేరకు ఈ వేడుకలను ఘనంగా కొనసాగిస్తున్నారు.

నవరాత్రుల సందర్భంగా పరిశ్రమలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారికి సమర్పించిన చీరను పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ప్రతిరోజూ లక్కీ డ్రా ద్వారా ఎంపికైన ఒకరికి అందజేస్తున్నారు. ఈ క్రమంలో నవరాత్రుల మూడో రోజు నిర్వహించిన లక్కీ డ్రాలో నగరూరు లక్ష్మీదేవి విజేతగా నిలిచి అమ్మవారి చీరను అందుకున్నారు.

ఉద్యోగుల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందించడంతో పాటు, పండుగ సంతోషాలను అందరూ కలిసి పంచుకోవాలనే ఉద్దేశంతో యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నవరాత్రుల వేడుకలు, ప్రత్యేక పూజలు, లక్కీ డ్రా కార్యక్రమాలతో పరిశ్రమలో పండుగ సందడి నెలకొంది.

ఈ కార్యక్రమంలో వ్యాలీ గ్రీన్ గార్మెంట్ యాజమాన్య ప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL