Pamidi: పామిడి మండలంలో పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల!
Pamidi: పామిడి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరం. మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలకు 46 పోలింగ్ కేంద్రాల తుది జాబితాను విడుదల చేసిన ఎంపీడీవో!
Pamidi: పామిడి మండలంలో పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల!
Pamidi: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి పామిడి మండలంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఎన్నికలకు అవసరమైన పోలింగ్ కేంద్రాల తుది జాబితాను శనివారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీవో ప్రభాకర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పామిడి మండలంలో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని, వాటిలో పామిడి పట్టణ పరిధిలో 6 స్థానాలు, గ్రామీణ ప్రాంత పరిధిలో 8 స్థానాలు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం పామిడి పట్టణంలోని ఎస్సీ హాస్టల్‌లో ఒక ఎంపీటీసీ స్థానానికి మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే పామిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐదు ఎంపీటీసీ స్థానాలకు 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలోని ఎనిమిది ఎంపీటీసీ స్థానాలకు 26 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా మొత్తం 46 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసి ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు ఎంపీడీవో ప్రభాకర్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు అశ్వత్ నాయుడు, రంగనాయకులు, ఏఓ హరినాథ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.




