Pamidi: పామిడిలో ఘనంగా రక్తదాన శిబిరం: భారీగా తరలివచ్చిన యువత

Pamidi: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా అనంతపురం జిల్లా పామిడిలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి యువత నుంచి విశేష స్పందన లభించింది.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 2 Oct 2026 5:59 PM IST
Pamidi
X

Pamidi: పామిడిలో ఘనంగా రక్తదాన శిబిరం: భారీగా తరలివచ్చిన యువత

పామిడి: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని పామిడి మండల కేంద్రంలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువత, స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

ఆపదలో ఉన్న వారికి రక్తం అందించి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో పలువురు యువతీ యువకులు, బీజేపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి నిర్వాహకులు సర్టిఫికెట్లు అందజేశారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఓబీసీ మోర్చా ప్రతినిధులు తెలిపారు.

కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనగొండ్ల రాజేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుపాటి సౌభాగ్య, ఓబీసీ మోర్చా అనంతపురం జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మనోజ్, మండల అధ్యక్షుడు అంజి నాయక్, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పూజారి లక్ష్మీదేవి, సీనియర్ నాయకులు మల్లికార్జున ఆచారి, సుందరయ్య, కుమారస్వామి, రామనరేష్ పాల్గొన్నారు.

అలాగే యువ నాయకులు రాజశేఖర్ గౌడ్, పవన్, నరేష్ యాదవ్, చంద్ర, నాగేంద్రతో పాటు గుంతకల్లు నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కూటమి నాయకులు, ఓబీసీ మోర్చా కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడంతో శిబిరం విజయవంతంగా ముగిసింది.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL