Pamidi: పామిడి మేజర్ పంచాయతీలో జనసేనకు మూడు వార్డులు.. ఒకటి ఏకగ్రీవం
Pamidi: అనంతపురం జిల్లా పామిడి మేజర్ పంచాయతీలో కూటమి తరఫున జనసేనకు మూడు వార్డులు కేటాయింపు; 19వ వార్డు సభ్యురాలిగా మేకల కృష్ణవేణి ఏకగ్రీవ ఎన్నిక.
Pamidi: పామిడి మేజర్ పంచాయతీలో జనసేనకు మూడు వార్డులు.. ఒకటి ఏకగ్రీవం
పామిడి: పామిడి మేజర్ పంచాయతీ ఎన్నికల్లో కూటమి తరఫున జనసేన పార్టీకి మూడు వార్డు సభ్యుల స్థానాలు కేటాయించడం పట్ల జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేటాయించిన మూడు స్థానాల్లో 19వ వార్డు సభ్యురాలిగా కత్రిమల సుబ్బు సతీమణి మేకల కృష్ణవేణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా జనసైనికులు మాట్లాడుతూ.. గుంతకల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, పామిడి మండల కూటమి ఇన్‌చార్జి గుమ్మనూరు ఈశ్వర్, జనసేన పార్టీ ఇన్‌చార్జి మణికంఠ ప్రత్యేక చొరవ తీసుకుని జనసేన పార్టీకి మూడు వార్డు సభ్యుల స్థానాలు కేటాయించడం ఆనందకరమన్నారు. కూటమిలో జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యత, గౌరవం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు.




