Pamidi: జోజోడు కుమార్ తండ్రి మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే సంతాపం

Pamidi: పామిడిలో మృతి చెందిన వైఎస్సార్‌సీపీ నేత శంకర్‌రావు భౌతికకాయానికి గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 8 Oct 2026 10:49 PM IST
Pamidi
X

Pamidi: జోజోడు కుమార్ తండ్రి మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే సంతాపం

పామిడి: పామిడి పట్టణం హనుమాన్ టాకీస్ సమీపంలో మాజీ వైసీపీ పామిడి టౌన్ అధ్యక్షులు, మాజీ టౌన్ కన్వీనర్ జోజోడు కుమార్ తండ్రి శంకర్‌రావు మృతి చెందారు. విషయం తెలుసుకున్న గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే కొట్రికే మధుసూదన్ గుప్తా శంకర్‌రావు నివాసానికి వెళ్లారు.

ఈ సందర్భంగా శంకర్‌రావు భౌతికదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జోజోడు కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శంకర్‌రావు మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL