Pamidi: పామిడిలో విషాదం: కరెంట్ షాక్‌తో బీటెక్ విద్యార్థి మృతి
Pamidi: అనంతపురం జిల్లా పామిడిలో నిర్మాణంలో ఉన్న ఇంటికి నీళ్లు పడుతూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై బీటెక్ విద్యార్థి రాహుల్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Pamidi: పామిడిలో విషాదం: కరెంట్ షాక్‌తో బీటెక్ విద్యార్థి మృతి
పామిడి: అనంతపురం జిల్లా పామిడిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై బీటెక్ విద్యార్థి రాహుల్ గౌడ్ (22) మృతిచెందాడు.
స్థానికుల వివరాల మేరకు, పామిడిలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటి భవనానికి నీరు పడుతుండగా ప్రమాదవశాత్తు రాహుల్ గౌడ్ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




