Obuladevaracheruvu: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు శ్రీధర్ రెడ్డి!

Obuladevaracheruvu: ఓబులదేవరచెరువులో వైఎస్సార్‌సీపీ విలేకరుల సమావేశంలో పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

S.Firoz, Sri Sathya Sai
Published on: 16 Oct 2026 4:30 PM IST
Obuladevaracheruvu
X

Obuladevaracheruvu: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు శ్రీధర్ రెడ్డి!

ఓబులదేవరచెరువు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి విమర్శించారు. పుంగనూరులో చోటుచేసుకున్న ఘటన ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవరచెరువులో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో కూటమి ప్రభుత్వం వెనుకబడిందని, ఆ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దించాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఉనికిని కాపాడుకునేందుకు చంద్రబాబు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రస్తుతం సాగిస్తున్న అరాచకాలే భవిష్యత్తులో ఆ ప్రభుత్వానికి శాపంగా మారతాయని ఆయన హెచ్చరించారు.

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai