Anantapuram: అనంతపురంలో ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ పోలింగ్!
Anantapuram: అనంతపురం నగరంలో స్థానిక మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పటిష్ట భద్రత నడుమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఓటర్లు.
Anantapuram: అనంతపురంలో ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ పోలింగ్!
Anantapuram: అనంతపురం నగరంలో స్థానిక మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉన్నతాధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ఇందులో భాగంగా నగరంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.మరోవైపు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభం కావడంతో అప్పటికే ఓటర్లు బారులు తీరి కనిపించారు.ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములవుతూ ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.




