Anantapur: అనంతపురంలో ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు!

Anantapur: అనంతపురంలో 'స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు-2026' ఘనంగా జరిగాయి. 71 మంది విజేతలకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఓ. ఆనంద్ పురస్కారాలు అందజేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 3 Oct 2026 7:14 AM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు!

Anantapur: అనంతపురం నగరంలోని అలెగ్జాండర్ హోటల్‌లో గురువారం 'స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు - 2026' జిల్లా స్థాయి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ భవాని రవికుమార్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు,

అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛత కార్యక్రమంలో విశేష ప్రతిభ కనబరిచిన 22 కేటగిరీలలో 71 మంది విజేతలకు పురస్కారాలను అందజేశారు.

ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..

గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.'వికసిత్ భారత్ 2047', 'స్వర్ణాంధ్ర 2047' విజన్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధికి కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 'పల్లె పండుగ' ద్వారా రూ.11,500 కోట్లతో గ్రామీణ మౌలిక వసతులు కల్పిస్తున్నారని, మంత్రి నారా లోకేష్ 20 లక్షల ఉద్యోగాల కల్పనకు శ్రమిస్తున్నారని వెల్లడించారు.

మదనపల్లెలో 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్' ప్రారంభించి, రూ.1 లక్ష కోట్లతో హార్టికల్చర్ రంగాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే చర్యలు చేపట్టారన్నారు.

నీటి పొదుపు, డ్రిప్ ఇరిగేషన్‌లో అనంతపురం జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం గర్వకారణమని కొనియాడారు.జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ మాట్లాడుతూ..

నామినేషన్ల పరిశీలన మరియు థర్డ్ పార్టీ ఏజెన్సీ ఫీల్డ్ వెరిఫికేషన్ ద్వారా అర్హులైన 71 మందిని పారదర్శకంగా ఎంపిక చేసినట్లు చెప్పారు.

జిల్లాలోని ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి, QR కోడ్ విధానం ద్వారా ఇళ్ల నుండి చెత్త సేకరణ ప్రక్రియను మెరుగుపరచనున్నట్లు ప్రకటించారు.ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి మాట్లాడుతూ..

స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే విజయం సాధిస్తామని పిలుపునిచ్చారు.

తడి-పొడి చెత్త వేరుచేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చిన్నప్పటి నుంచే పిల్లల్లో శుభ్రతపై అవగాహన పెంచాలని సూచించారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM