Singanamala: అనంతపురం జిల్లా యల్లనూరులో టీడీపీ అభ్యర్థి జనార్దన్పై దాడి!

Singanamala: అనంతపురం జిల్లా యల్లనూరులో టీడీపీ అభ్యర్థి జనార్దన్ కుటుంబంపై వైఎస్సార్‌సీపీ నేతల దాడి. ఎమ్మెల్యే శ్రావణి శ్రీ తీవ్ర ఖండన, కఠిన చర్యల హెచ్చరిక.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 Oct 2026 4:16 PM IST
Singanamala
X

Singanamala: అనంతపురం జిల్లా యల్లనూరులో టీడీపీ అభ్యర్థి జనార్దన్పై దాడి!

Singanamala: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ పరిధి లోని యల్లనూరు లో నామినేషన్లు వేసేందుకు వెళ్లిన టీడీపీ అభ్యర్థి జనార్దన్, ఆయన కుటుంబ సభ్యులపై వైసీపీ నాయకులు పక్కా ప్రణాళికతో రాళ్లు, రాడ్లు, కొడవళ్లతో దాడికి తెగబడ్డారని ఎమ్మెల్యే శ్రావణి శ్రీ ఆరోపించారు. జగన్ ఆదేశాలతోనే ఏకగ్రీవాల కోసం వైసీపీ నేతలు మళ్లీ భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆమె విమర్శించారు. సీఎం చంద్రబాబు పాలనలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయని, అభివృద్ధి మరియు ప్రశాంత వాతావరణం కోసం కూటమి అభ్యర్థులనే గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె గట్టిగా హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్