OD Cheruvu: ఓ.డి చెరువు మండలంలో రూ.52.91 కోట్లతో 56 అభివృద్ధి పనులకు శ్రీకారం!
OD Cheruvu: ఓ.డి చెరువు మండలంలో రూ.52.91 కోట్లతో 56 అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి. పరిశ్రమలతో భారీ ఉపాధి.
OD Cheruvu: ఓ.డి చెరువు మండలంలో రూ.52.91 కోట్లతో 56 అభివృద్ధి పనులకు శ్రీకారం!
OD Cheruvu: పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఓ.డి చెరువు మండలంలో రూ.52.91 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 56 అభివృద్ధి పనులకు పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మండలంలో పర్యటించిన వారు వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్రానికి రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించే దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు.
పుట్టపర్తి నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా భారీ పెట్టుబడుల ప్రతిపాదనలు ముందుకు వస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు. సుమారు రూ.1.51 లక్షల కోట్ల పెట్టుబడులతో నియోజకవర్గంలో వివిధ ప్రాజెక్టులు అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు.
దేశంలోని పలు రాష్ట్రాలు యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు కోసం పోటీ పడినప్పటికీ కేంద్రం యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి ప్రాంతంలో ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడటం ఈ ప్రాంతానికి ప్రాధాన్యతను పెంచుతుందని పేర్కొన్నారు. అలాగే ఆమడగూరు మండలంలో రూ.51 వేల కోట్లతో ప్రతిపాదించిన రిలయన్స్ సోలార్ ప్రాజెక్టు అమలులోకి వస్తే పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని నాయకులు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులను చేపడుతూ పుట్టపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ముందుగా ఓడి చెరువు మండలం అల్లాపల్లి పంచాయతీలోని బోయపల్లిలో,తంగేడు కుంట పంచాయతీలో ఎర్రబెల్లి, గొల్లవారి పల్లి, చౌడేపల్లి ,ఉగ్గిరెడ్డి పల్లి, ,చింతమానీపల్లి పంచాయతీలోని మల్లెవాండ్ల పల్లి ,కొండకమార్ల పంచాయతీ లోని నవాబుకోట, నాయనాకోట ,డబురువారి పంచాయితీ , వెంకటాపురం ,ఓడి చెరువు పంచాయతీ, మామిళ్ళకుంట్లపల్లి ,తిప్పెపల్లి పంచాయతీ,సున్నం పల్లి పంచాయతీలోనీ పర్యటించి పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి చేతుల ప్రారంభించారు. పనుల ప్రారంభోత్సవానికి కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులు , ప్రభుత్వ అధికారులు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.




