Kadiri: కదిరిలో తీరిన తాగునీటి కష్టాలు ఎమ్మెల్యే కందికుంటకు కృతజ్ఞతలు!
Kadiri: శ్రీసత్యసాయి జిల్లా మండలం కందికుంట ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. కృతజ్ఞతలు తెలిపిన కాలనీవాసులు.
Kadiri: కదిరిలో తీరిన తాగునీటి కష్టాలు ఎమ్మెల్యే కందికుంటకు కృతజ్ఞతలు!
Kadiri: సత్యసాయి జిల్లా కదిరి పట్టణ సమీపంలోని కందికుంట ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కి కాలనీవాసుల కృతజ్ఞతలు తెలిపారు
కదిరి మండలం ముత్యాల చెరువు పంచాయతీ పరిధిలోని కందికుంట ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన స్పందించి కొత్త బోరు మోటార్ను వేయించి, తాగునీటి సమస్య పరిష్కరించారు.
తాగునీటి సమస్య పరిష్కారం కావడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను పట్టించుకుని వెంటనే పరిష్కరించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కు “థాంక్యూ ఎమ్మెల్యే సార్” అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నో రోజులుగా తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొన్న తమకు ప్రస్తుతం నీటి సౌకర్యం అందుబాటులోకి రావడంతో ఊరట లభించిందని కాలనీవాసులు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి స్పందించి పరిష్కరించడం పట్ల వారు ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.




