Kadiri: కదిరిలో 'స్కై లాబన్' డెజర్ట్ సంస్థను ప్రారంభించిన ఎమ్మెల్యే!
Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలో ప్రసిద్ధ డెజర్ట్ బ్రాండ్ 'స్కై లాబన్'ను ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. విభిన్న రుచులతో స్వీట్లు, కునఫా అందజేత.
Kadiri: కదిరిలో 'స్కై లాబన్' డెజర్ట్ సంస్థను ప్రారంభించిన ఎమ్మెల్యే!
Kadiri: సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ప్రత్యేకమైన స్వీట్స్, డెజర్ట్స్‌ను అందించే ప్రముఖ బ్రాండ్ స్కై లాబన్ (Sky Laban) సంస్థను కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు.
సౌదీ, ఈజిప్ట్ దేశాల ప్రత్యేక డెజర్ట్‌ల శైలిలో రూపొందించిన వివిధ రకాల స్వీట్స్, కునఫా, లాబన్ చీజ్‌కేక్‌లు, చాక్లెట్, పిస్తా తదితర ఫ్లేవర్లతో కూడిన డెజర్ట్స్‌ను ఈ సంస్థ అందిస్తోంది. విభిన్న రుచులతో కూడిన నూతన ఆహార ఉత్పత్తులు కదిరి పట్టణ ప్రజలకు అందుబాటులోకి రావడం విశేషం అని,ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంస్థ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానికంగా నూతన వ్యాపార సంస్థలు ఏర్పాటై ప్రజలకు వివిధ రకాల సేవలు అందించడంతో పాటు, వ్యాపార అభివృద్ధికి మరియు ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ యాజమాన్యం, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.




