Nallacheruvu: టీడీపీ సీనియర్ నాయకులు రెడప్ప మృతి పట్ల ఎమ్మెల్యే సంతాపం!
Nallacheruvu: సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం జోగన్నపేట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు రెడప్ప మృతి పట్ల కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సంతాపం తెలిపారు.
Nallacheruvu: టీడీపీ సీనియర్ నాయకులు రెడప్ప మృతి పట్ల ఎమ్మెల్యే సంతాపం!
Nallacheruvu: సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం జోగన్నపేట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రెడప్ప మృతి చెందారు. విషయం తెలుసుకున్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ వారి స్వగ్రామానికి వెళ్లి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రెడప్ప మృతి పార్టీకి తీరని లోటు అని వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే తెలిపారు.




