Tadipatri: తాడిపత్రిలో ఓటు వేసిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి!
Tadipatri: తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాడిపత్రిలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతోందని స్పష్టం చేశారు.
Tadipatri: తాడిపత్రిలో ఓటు వేసిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి!
Tadipatri: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాడిపత్రిలో ప్రశాంతత ఎప్పటికీ ఉంటుంది. తాడిపత్రి అంటేనే ప్రశాంతత... ప్రశాంతత అంటేనే తాడిపత్రి. గతంలో మాదిరిగానే నేడు కూడా అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోంది.ప్రజలందరూ బాధ్యతగా ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
నియోజకవర్గంలో పోలింగ్ సరళి పై ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.ఓటర్లు ఎటువంటి భయభ్రాంతులకు గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారన్నారు. నేడు శాంతియుత ప్రజాస్వామ్య ప్రక్రియ కనిపిస్తోందన్నారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రజలంతా నిర్భయంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని జేసీ అస్మిత్ రెడ్డి పిలుపునిచ్చారు.




