Anantapur: అనంతపురంలో ప్రశాంతంగా మున్సిపల్ పోలింగ్!

Anantapur: అనంతపురంలో ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, పోలింగ్ సరళిని పరిశీలించిన మంత్రి సత్యకుమార్.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 1 Nov 2026 11:32 AM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో ప్రశాంతంగా మున్సిపల్ పోలింగ్!

Anantapur: అనంతపురం నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు.

నగరంలోని 43వ డివిజన్ పరిధిలో ఉన్న ఝాన్సీ లక్ష్మీబాయి పాఠశాలలో ఏర్పాటు చేసిన రెండవ పోలింగ్ బూత్‌లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఆయనతో పాటు సతీమణి శ్రీలక్ష్మి, కుమార్తె ఆశ్రిత ఓటు వేశారు. అనంతరం మంత్రి సత్యకుమార్ కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకుని పోలింగ్ సరళిని పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మీడియాతో, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ.. గత 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో అనంతపురం నగరంలో దౌర్జన్యపూరితంగా, అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయని విమర్శించారు.

అయితే ఈసారి నగరంలోని 62 డివిజన్లలో ఎక్కడా చిన్నపాటి అలజడి కూడా లేకుండా అత్యంత ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతోందన్నారు.రాష్ట్రంలో ఎన్నికలను సంపూర్ణ ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని, అందుకు అనుగుణంగా ఎన్నికల యంత్రాంగం నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తోందని తెలిపారు.

గతంలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి దాదాపు 85 శాతం స్థానాలను దౌర్జన్యంగా ఏకగ్రీవం చేసుకున్నారని ఆరోపించారు.అలాంటి దౌర్జన్య రాజకీయాలకు తమ ప్రభుత్వంలో తావులేదని స్పష్టం చేశారు.

ప్రజలంతా ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.నగరంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు తమ ఓటు ద్వారా సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM