Anantapur: సర్వజనాస్పత్రిలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మిక తనిఖీ!
Anantapur: అనంతపురం సర్వజనాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. ఓపీ విభాగాల్లో వైద్యుల గైర్హాజరుపై అసంతృప్తి.
Anantapur: సర్వజనాస్పత్రిలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మిక తనిఖీ!
Anantapur: అనంతపురం జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఉదయమే ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే.. వివిధ విభాగాల వార్డులను పరిశీలించారు.వార్డుల్లోని రోగులతో నేరుగా మాట్లాడి.. అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.అనంతరం అన్ని ఓపి విభాగాలను పరిశీలించి.. క్యూలైన్లలో ఉన్న రోగులతో మాట్లాడారు.
అయితే ఓపి సేవల్లో హెచ్వోడీలు అందుబాటులో లేకపోవడంపై ఎమ్మెల్యే దగ్గుపాటి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను వివరణ కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 560 పడకల సామర్థ్యం ఉన్న సర్వజనాస్పత్రిలో ప్రస్తుతం 1200 మంది ఇన్‌పేషెంట్లు, రోజుకు సుమారు 2300 మంది ఓపీ రోగులు వస్తున్నారని తెలిపారు.
పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న సిబ్బంది, సౌకర్యాలు సరిపోవడం లేదని ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై తగినంత శ్రద్ధ చూపలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ నిధులతో పాటు సీఎస్ఆర్ నిధులను వినియోగించి ఆసుపత్రిలో మదర్ మిల్క్ బ్యాంక్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు.




