Anantapur: 32 ఏళ్ల తర్వాత అనంతపురం రూరల్ పంచాయతీల్లో టీడీపీ విజయకేతనం!
Anantapur: అనంతపురం రూరల్ మండలంలో 32 ఏళ్ల తర్వాత టీడీపీ 3 సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది. విజేతలను ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఘనంగా సన్మానించారు.
Anantapur: 32 ఏళ్ల తర్వాత అనంతపురం రూరల్ పంచాయతీల్లో టీడీపీ విజయకేతనం!
Anantapur: అనంతపురం రూరల్ మండలంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. మూడు సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుని విజయకేతనం ఎగురవేసింది. ఈ విజయంపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా అనంతపురంలోని తన అర్బన్ కార్యాలయంలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు సభ్యులను ఎమ్మెల్యే శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే.. రూరల్ మండలంలో అభివృద్ధి పనులు వేగవంతం కావడం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే టీడీపీ అభ్యర్థుల విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో, యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో మూడు సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడం సంతోషంగా ఉందన్నారు.ఈ విజయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు కానుకగా అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే రోజుల్లో అనంతపురం నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పష్టం చేశారు.




