Chilamathur: చిలమత్తూరు ZPTC అభ్యర్థిగా రంగారెడ్డి నామినేషన్!

Chilamathur: శ్రీ సత్యసాయి జిల్లా జెడ్పీటీసీ అభ్యర్థిగా రంగారెడ్డిని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు ప్రకటించారు పుట్టపర్తిలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు

RAMANJANEYULU, HINDUPUR
Published on: 22 Oct 2026 3:54 PM IST
Chilamathur
X

Chilamathur: చిలమత్తూరు ZPTC అభ్యర్థిగా రంగారెడ్డి నామినేషన్!

Chilamathur: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు జడ్పిటిసి అభ్యర్థిగా రంగారెడ్డి ని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ప్రకటించారు.

చిలమత్తూరు మండలం జడ్పిటిసి స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పార్టీకి విధేయుడుగా మండల కన్వీనర్ గా పార్టీకి సేవలు అందించి పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జడ్పిటిసి అభ్యర్థిగా అవకాశం కల్పించడంతో కృతజ్ఞతలుగా ఉంటానని తెలిపారు అదే విధంగా మండల రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న

ఈ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా,శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి జడ్పీ కార్యాలయంలో తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా సమర్పించారు.ఈ నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మండలంలోని టిడిపి నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు.

RAMANJANEYULU, HINDUPUR

RAMANJANEYULU, HINDUPUR