Sri Sathya Sai: తిమ్మమ్మమర్రిమాను వద్ద వైభవంగా పర్యాటక దినోత్సవ సంబరాలు
Sri Sathya Sai: తిమ్మమ్మమర్రిమాను వద్ద ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు. రూ.9 కోట్లతో నిర్మించనున్న బొటానికల్ పార్క్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్.
Sri Sathya Sai: తిమ్మమ్మమర్రిమాను వద్ద వైభవంగా పర్యాటక దినోత్సవ సంబరాలు
Sri Sathya Sai: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నంబుల పూలకుంట మండలంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిమ్మమ్మమర్రిమాను వద్ద ఘనంగా సంబరాలు నిర్వహించారు.
కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పర్యాటక ప్రేమికులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా తిమ్మమ్మమర్రిమాను వృక్షం వద్ద రూ.9 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బొటానికల్ పార్క్‌కు కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కలిసి శంకుస్థాపన చేశారు.
మర్రిమాను వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్థానిక కళాకారుల ప్రదర్శనలు, సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని తిమ్మమ్మమర్రిమాను ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి మరింత ప్రాధాన్యత కల్పించే కార్యక్రమాలు నిర్వహించడం పట్ల స్థానికులు, పర్యాటక ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు.




