Dharmavaram: ధర్మవరంలో దివ్యాంగ బాలుడికి మంత్రి సత్యకుమార్ భరోసా!
Dharmavaram: ధర్మవరంలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్, పుట్టుకతోనే మానసిక వికలాంగత్వంతో బాధపడుతున్న బాలుడిని కలిసి ప్రభుత్వ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
Dharmavaram: ధర్మవరంలో దివ్యాంగ బాలుడికి మంత్రి సత్యకుమార్ భరోసా!
Dharmavaram: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ నేడు పర్యటించారు. ముందుగా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని అనంతరం టీ తాగుతూ స్థానికులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ధర్మవరం పట్టణం కాగితాల వీధికి చెందిన ఆరు సంవత్సరాల బాలుడు పుట్టుకతోనే మానసిక వికలాంగత్వంతో బాధపడుతున్నాడు.. బాలుడిని వెంటబెట్టుకొని తల్లిదండ్రులు మంత్రిని కలవగా బాలుడి పరిస్థితిని చూసి మంత్రి చలించి ప్రభుత్వ పరంగా సహాయం అందజేస్తామని బాలుడి తల్లిదండ్రులకు అభయం ఇచ్చారు.




