Kadiri: టీడీపీలోకి భారీ చేరికలు.. కండువా కప్పిన ఎమ్మెల్యే కందికుంట!
Kadiri: కదిరిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో 39, 33, 38వ వార్డుల నాయకులు కార్యకర్తలు భారీగా టీడీపీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
Kadiri: టీడీపీలోకి భారీ చేరికలు.. కండువా కప్పిన ఎమ్మెల్యే కందికుంట!
Kadiri: కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో 39, 33, 38వ వార్డుల నుంచి టీడీపీ లోకి భారీ చేరికలు సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో 39, 33, 38వ వార్డులకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
39వ వార్డు అభ్యర్థి తాత శ్రీనివాసులు, 33వ వార్డు అభ్యర్థి విజయ్ కుమార్, 38వ వార్డు అభ్యర్థి అతహర్ ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఖకాషా వలి, దాదాపీర్, రహమత్, షేక్ బాబ్జాన్, రమణమ్మ, షేక్ సోహైల్, నరేష్, బాబా, తౌఫిక్ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరగా వీరందరికీ ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు నాయకులు, బూత్ ఇన్‌చార్జులు తదితరులు పాల్గొన్నారు.




