Kasapuram: కసాపురం విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి పూజలు!
Kasapuram: కసాపురం విశ్వేశ్వర స్వామి ఆలయంలో దేవీ నవరాత్రుల పూజలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. రుద్రాభిషేకం, కుంకుమార్చనల్లో భక్తులు పాల్గొన్నారు.
Kasapuram: కసాపురం విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి పూజలు!
కసాపురం: అనంతపురం జిల్లా కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ కాశీ విశాలాక్షీ సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో దేవీ నవరాత్రుల సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఉదయం 9 గంటల నుంచి దేవస్థాన వేద పండితులు, అర్చక పరివారం, ఆగమ పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో శ్రీ విశ్వేశ్వర స్వామి వారికి ఏకవార రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ విశాలాక్షి అమ్మవారికి త్రిశతి, ఖడ్గమాల కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి, మహా మంగళహారతి సమర్పించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు.
సాయంత్రం 6:30 గంటల నుంచి లలితా సహస్రనామార్చన, దేవి ఖడ్గమాల అర్చన, సామూహిక కుంకుమార్చనతో పాటు సువాసినీ, కుమారీ పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు, అనువంశిక ధర్మకర్త కే. సుగుణమ్మ, వేద పండితులు, అర్చకులు, ఆలయ సిబ్బంది, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.




