Kalyanadurgam: కళ్యాణదుర్గం టీడీపీ రేస్కు తెర మున్సిపల్ చైర్మన్గా బుట్నా లక్ష్మి!
Kalyanadurgam: కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా బుట్నా లక్ష్మి పేరును ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఖరారు చేశారు. పట్టణాభివృద్ధే ధ్యేయమని పిలుపునిచ్చారు.
Kalyanadurgam: కళ్యాణదుర్గం టీడీపీ రేస్కు తెర మున్సిపల్ చైర్మన్గా బుట్నా లక్ష్మి!
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి ఎంపికపై టీడీపీలో కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా బుట్నా లక్ష్మి పేరును ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఖరారు చేశారు. పలువురు ఆశావహుల పేర్లు పరిశీలనకు రావడం, ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించినట్లు ప్రచారం జరగడంతో అభ్యర్థి ఎవరన్న అంశంపై స్థానికంగా ఆసక్తి నెలకొంది. చివరకు బుట్నా లక్ష్మి పేరు ఖరారు కావడంతో ఈ ఉత్కంఠకు ముగింపు లభించింది.
పలువురి పేర్ల పరిశీలన.. చివరకు లక్ష్మికి అవకాశం
చైర్పర్సన్ అభ్యర్థి ఎంపికలో భాగంగా చల్లా శశికళ, బోయ కవిత, పల్లవి, అమర బిందు పేర్లు పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. తొలుత పల్లవి పేరు ప్రచారంలో ఉండగా,ఇతర పేర్లపైనా పార్టీ నాయకత్వం చర్చించినట్లు తెలిసింది. ఈ పరిణామాల అనంతరం బుట్నా లక్ష్మిని అభ్యర్థిగా ఖరారు చేశారు.
పట్టణ అభివృద్ధికి కృషి చేస్తాం
శుక్రవారం బుట్నా తిమ్మరాజు నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ, పార్టీకి నిబద్ధతతో పనిచేసిన బుట్నా కుటుంబానికి టీడీపీ గుర్తింపు ఇచ్చిందన్నారు. ఆ కుటుంబానికి చెందిన లక్ష్మికి చైర్పర్సన్ అభ్యర్థిగా అవకాశం కల్పించినట్లు తెలిపారు. పట్టణ ప్రజలు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని, టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మున్సిపాలిటీలో అవినీతి, అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే ఆరోపించారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల అమలుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: బుట్నా లక్ష్మి...
తనకు చైర్పర్సన్ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపిన బుట్నా లక్ష్మి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. కళ్యాణదుర్గం పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, తనను గెలిపించి ప్రజాసేవకు అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మోరేపల్లి మల్లికార్జున, బిక్కి గోవిందప్ప, బీజేపీ నాయకుడు దేవరాజు, పట్టణ నాయకులు, కూటమి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.




