Kalyandurg: కళ్యాణదుర్గంలో ముమ్మరంగా సాగుతున్న ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం!
Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం. కూటమి అభ్యర్థుల విజయాన్ని కోరిన ఎమ్మెల్యే సురేంద్రబాబు తనయుడు అమిలినేని యశ్వంత్.
Kalyandurg: కళ్యాణదుర్గంలో ముమ్మరంగా సాగుతున్న ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం!
Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తనయుడు అమిలినేని యశ్వంత్ ప్రజలను కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో విస్తృతంగా పర్యటిస్తూ కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీదేవి, 32 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా యశ్వంత్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గెలిచిన తర్వాత కళ్యాణదుర్గం పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, పార్కు అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. పట్టణంలో అభివృద్ధి పనులు మరింత ముందుకు సాగాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.
కళ్యాణదుర్గాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే తనయుడు యశ్వంత్ పట్టణంలో నిర్వహించిన ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




