Kalyandurg: కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్‌పర్సన్‌ అభ్యర్థులు ఖరారు!

Kalyandurg: కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థులు ఖరారయ్యారు. కూటమి తరఫున బుట్నా లక్ష్మీదేవి, వైసీపీ నుంచి హర్షిని బరిలో నిలవనున్నారు.

P.Sudhakar, Kalyanadurgam
Published on: 16 Oct 2026 3:47 PM IST
Kalyandurg
X

Kalyandurg: కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్‌పర్సన్‌ అభ్యర్థులు ఖరారు!

కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చైర్‌పర్సన్‌ అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీల్లో కసరత్తు కొనసాగుతోంది. కూటమి తరఫున బుట్నా లక్ష్మీదేవి పేరును స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అధికారికంగా ఖరారు చేశారు. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బుట్నా తిమ్మరాజు సతీమణి లక్ష్మీదేవిని మున్సిపల్ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ప్రకటించారు.

మరోవైపు వైసీపీ తరఫున చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా కళ్యాణదుర్గం మండలం దొడగట్ట గ్రామానికి చెందిన హర్షిని పేరును మాజీ ఎంపీ తలారి రంగయ్య ఖరారు చేసినట్లు సమాచారం. హర్షిని బీఎస్సీ అగ్రికల్చర్‌ పూర్తి చేశారు. దీంతో కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్‌పర్సన్‌ పదవికి కూటమి, వైసీపీ తరఫున అభ్యర్థుల పేర్లు తెరపైకి వచ్చాయి.

అభ్యర్థుల ఎంపికతో కళ్యాణదుర్గం పట్టణంలో మున్సిపల్ ఎన్నికలపై రాజకీయ చర్చ మొదలైంది. నామినేషన్ల దాఖలు, ఎన్నికల ప్రచారం, వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలు రానున్న రోజుల్లో ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. అభ్యర్థుల అధికారిక నామినేషన్లు, తుది జాబితా వెలువడిన తర్వాత ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై పూర్తి స్పష్టత రానుంది.

P.Sudhakar, Kalyanadurgam

P.Sudhakar, Kalyanadurgam