Kalyandurg: రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే అమిలినేని
Kalyandurg: కళ్యాణదుర్గం - అనంతపురం రహదారిపై రోడ్డు ప్రమాద బాధితుడిని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తన వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.
Kalyandurg: రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే అమిలినేని
కళ్యాణదుర్గం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ కోసం ఎదురుచూడకుండా తన వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. కళ్యాణదుర్గం–అనంతపురం ప్రధాన రహదారిపై హనిమిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని సబ్‌స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వైపు వెళ్తున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు.. రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న వ్యక్తిని గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి బాధితుడి పరిస్థితిని పరిశీలించారు.
అంబులెన్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు గుర్తించిన ఎమ్మెల్యే.. ఆలస్యం చేయకుండా తన సిబ్బంది సహాయంతో గాయపడిన వ్యక్తిని తన వాహనంలోకి ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని కళ్యాణదుర్గం పట్టణంలోని ఖమ్మం చెట్ల వీధికి చెందిన 43 ఏళ్ల కోటి జయరాంగా గుర్తించారు.
హనిమిరెడ్డిపల్లి సమీపంలో రోడ్డుపైకి గొర్రెల మంద అడ్డుగా రావడంతో జయరాం ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన వెంటనే ఎమ్మెల్యే స్పందించి బాధితుడిని ఆసుపత్రికి తరలించడంతో సకాలంలో వైద్యం అందించేందుకు అవకాశం కలిగింది. ఎమ్మెల్యే వెంట ఉన్న సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.




