Kalyandurg: ఆపదలో మానవత్వం చాటిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు!

Kalyandurg: ఆపదలో మానవత్వం చాటుకున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అంబులెన్స్ ఆలస్యమవడంతో రోడ్డు ప్రమాద బాధితుడిని సొంత వాహనంలో ఆసుపత్రికి తరలింపు.

SUDHAKAR, KALYANADGAM
Published on: 29 Sept 2026 11:35 PM IST
Kalyandurg
X

Kalyandurg: ఆపదలో మానవత్వం చాటిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు!

కళ్యాణదుర్గం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తన వాహనంలో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అంబులెన్స్‌కు ఫోన్ చేసినప్పటికీ.. అరగంటకు పైగా సమయం గడిచినా అంబులెన్స్ రాకపోవడంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించారు.

కళ్యాణదుర్గం–అనంతపురం ప్రధాన రహదారిపై హనిమిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని విద్యుత్ ఉపకేంద్రం వద్ద ఈ ప్రమాదం జరిగింది. కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వైపు వెళ్తున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు రహదారిపై రక్త గాయాలతో పడి ఉన్న వ్యక్తిని గమనించి వెంటనే తన వాహనాన్ని నిలిపారు. బాధితుడి పరిస్థితిని పరిశీలించారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే అరగంటకు పైగా గడిచినా అంబులెన్స్ అక్కడికి చేరుకోకపోవడంతో ఎమ్మెల్యే ఆలస్యం చేయకుండా తన సిబ్బంది సహాయంతో బాధితుడిని తన వాహనంలోకి ఎక్కించారు. అనంతరం అనంతపురంలోని ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదంలో గాయపడిన వ్యక్తి కళ్యాణదుర్గం పట్టణంలోని ఖమ్మం చెట్ల కాలనీకి చెందిన కోటి జయ రాములుగా (44) గుర్తించారు. హనిమిరెడ్డిపల్లి సమీపంలో రోడ్డుపైకి గొర్రెల మంద అడ్డుగా రావడంతో జయరాం ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో జయరాంకు తీవ్ర గాయాలయ్యాయి.

బాధితుడిని ఆసుపత్రికి తరలించే సమయంలో ఎమ్మెల్యే వెంట ఉన్న సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం అనంతపురం ఆసుపత్రిలో బాధితుడికి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాధితుడిని తన వాహనంలో అనంతపురం ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

SUDHAKAR, KALYANADGAM

SUDHAKAR, KALYANADGAM