Kalyandurg: కళ్యాణదుర్గంలో రూ.1.02 లక్షలకు వినాయక లడ్డూ వేలం!
Kalyandurg: కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్‌లో వినాయక లడ్డూ వేలంలో రికార్డు పాట! 11 కేజీల లడ్డూను రూ.1,02,000లకు దక్కించుకున్న తలారి రవి కుటుంబం.
Kalyandurg: కళ్యాణదుర్గంలో రూ.1.02 లక్షలకు వినాయక లడ్డూ వేలం!
Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని దొడగట్ట రోడ్డులో ఉన్న మార్కెట్ యార్డ్‌లో టీమ్ గజానన ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఐదు రోజుల పాటు గణనాథుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఐదు రోజుల పాటు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. దీంతో మార్కెట్ యార్డ్ పరిసర ప్రాంతం ఐదు రోజుల పాటు భక్తి వాతావరణంతో కళకళలాడింది. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు 11 కేజీల గణనాథుడి మహా ప్రసాదం లడ్డూకు వేలం పాట నిర్వహించారు.
వినాయకుడి లడ్డూను దక్కించుకునేందుకు పలువురు భక్తులు ఎంతో ఉత్సాహంగా వేలం పాటలో పాల్గొన్నారు. ఒకరిని మించి మరొకరు ధరను పెంచుతూ పోటాపోటీగా వేలం వేయడంతో కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. చివరకు రూ.1,02,000లకు తలారి తిమ్మక్క, ఆమె భర్త తలారి రవి కుమారుడు శ్రీకాంత్ 11 కేజీల వినాయకుడి లడ్డూను వేలం పాటలో దక్కించుకున్నారు. గణనాథుడి మహా ప్రసాదమైన లడ్డూను దక్కించుకోవడంతో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ లడ్డూ వేలం పాట ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అనంతరం భారీ సంఖ్యలో భక్తుల సమక్షంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. డప్పులు, వాయిద్యాల నడుమ భక్తుల ఆటపాటలు, నృత్యాలతో నిమజ్జన వేడుకలు ఉత్సాహంగా సాగాయి. యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో పరిసర ప్రాంతం మార్మోగింది.భక్తుల భక్తిశ్రద్ధలు, ఉత్సాహం, ఆటపాటలు, నృత్యాలతో నిమజ్జన ఊరేగింపు కన్నులపండువగా సాగింది. ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. భక్తి, ఆనందోత్సాహాల నడుమ నిర్వహించిన టీమ్ గజానన వినాయక చవితి ఉత్సవాలు, లడ్డూ వేలం పాట, నిమజ్జన కార్యక్రమం ఘనంగా ముగిశాయి.




