Kalyandurg: అభివృద్ధిని చూసి ఓటేయండి అమిలినేని యశ్వంత్!

Kalyandurg: కళ్యాణదుర్గం 15వ వార్డులో అమిలినేని యశ్వంత్ ఇంటింటి ప్రచారం. చాపిరి చెరువుకు నీళ్లు తేవడం సంతోషకరమంటూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి.

P.Sudhakar, Kalyanadurgam
Published on: 26 Oct 2026 10:34 PM IST
Kalyandurg
X

Kalyandurg: అభివృద్ధిని చూసి ఓటేయండి అమిలినేని యశ్వంత్!

కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి కూటమి బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తనయుడు అమిలినేని యశ్వంత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సోమవారం కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని 15వ వార్డు ఎర్రనేల వీధిలో మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజు, కౌన్సిలర్ అభ్యర్థి పూజారి నాగమణితో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలుసుకుని కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా అమిలినేని యశ్వంత్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పట్టణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం చాపిరి చెరువుకు నీళ్లు అందించడం రైతులతో పాటు తమకు కూడా ఎంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. చెరువుకు కృష్ణా జలాలు చేరడంతో రైతాంగానికి ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కళ్యాణదుర్గం పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారంతో పాటు ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి కనెక్షన్లు అందించే దిశగా పనులు జరుగుతున్నాయని యశ్వంత్ తెలిపారు. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి సుందరనగరంగా తీర్చిదిద్దాలంటే మున్సిపాలిటీలో కూటమి పాలకవర్గం ఏర్పడాలని అన్నారు.

మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజుతో పాటు కౌన్సిలర్ అభ్యర్థి పూజారి నాగమణిని, కూటమి తరఫున పోటీ చేస్తున్న మొత్తం 31 మంది వార్డు అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు విజయాన్ని కానుకగా అందించాలని ఓటర్లను కోరారు. ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

P.Sudhakar, Kalyanadurgam

P.Sudhakar, Kalyanadurgam