Kadiri: ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి క్రూరం: డాక్టర్ బత్తల హరి!
Kadiri: రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలపై దాడి చేసిన కూటమి శ్రేణులపై కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ బత్తల హరి డిమాండ్ చేశారు.
Kadiri: ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి క్రూరం: డాక్టర్ బత్తల హరి!
Kadiri: ఓటమి భయంతోనే కూటమి నాయకులు కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, రాయదుర్గం నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ బత్తలహరి తీవ్రంగా ఖండించారు. కదిరి పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నామినేషన్లు మొదటి రోజు రాయచోటి వైఎస్ఆర్సిపి కార్యాలయంపై దాడి చేసి మిథున్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.అదే విధంగా పుంగనూరులో కూడా ఎంపీ మిథున్ రెడ్డి వైసీపీ నేతలపై రాళ్ల దాడులు చేసి నామినేషన్లు కూడా దాఖలు చేయకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని, పోలీసులు టిడిపి కార్యకర్తలు కలిసి పని చేస్తున్నారని ఆరోపించారు. పుంగనూరు నామినేషన్ కేంద్రంలో సుమారు 400 మందికి పైగా కూటమి కార్యకర్తల చేరుకున్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారన్నారు. దాడులకు పాల్పడిన వారందరినీ గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.




