Kadiri: కదిరి అభివృద్ధికి రూ.29 కోట్ల నిధులు: ఎమ్మెల్యే కందికుంట

Kadiri: కదిరి మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు రూ.29 కోట్ల హ్యామ్ నిధుల పనులను ప్రారంభించారని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వెల్లడించారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 22 Sept 2026 4:38 PM IST
Kadiri
X

Kadiri: కదిరి అభివృద్ధికి రూ.29 కోట్ల నిధులు: ఎమ్మెల్యే కందికుంట

సత్యసాయి జిల్లా కదిరి: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల అభివృద్ధికి చేపట్టనున్న HAM ప్రాజెక్టుల వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కదిరి పట్టణంలోని గర్ల్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న తాయి గ్రాండ్‌లో కదిరి పట్టణ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో పాల్గొని ప్రసంగించారు.

కదిరి మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా దాదాపు రూ.29 కోట్ల HAM నిధులతో కదిరి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నామని కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు.

కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పట్టణాలు, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

అభివృద్ధే కూటమి ప్రభుత్వానికి రాజకీయ సమాధానం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ, “కదిరి పట్టణానికి దాదాపు రూ.29 కోట్ల HAM నిధులు తీసుకురావడం మాటలకే పరిమితం కాకుండా అభివృద్ధి పనులతో ప్రజలకు సమాధానం చెప్పే కూటమి ప్రభుత్వ విధానానికి నిదర్శనం” అని అన్నారు.

“గతంలో అధికారంలో ఉన్నవారు అభివృద్ధి గురించి ఎన్ని మాటలు చెప్పినా ప్రజల ముందున్న వాస్తవం ఏమిటో ప్రజలే గమనించారు. ఇప్పుడు కదిరి పట్టణానికి భారీగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాం. ప్రజలకు కావాల్సింది రాజకీయ విమర్శలు కాదు.. అభివృద్ధి, మౌలిక వసతులు, సంక్షేమం. కూటమి ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తోంది” అని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

“సీటు ఎవరికి వచ్చినా అభ్యర్థి ఒక్కరే కాదు.. కూటమి అభ్యర్థి. వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి టీడీపీ–జనసేన–బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి. ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి” అని అన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI