Kadiri: కదిరిలో పోలీసుల ‘వాక్ విత్ ప్రైడ్ అండ్ పీపుల్’

Kadiri: రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కదిరి పట్టణంలోని కుటాగుళ్ళలో పోలీసులు ‘వాక్ విత్ ప్రైడ్ అండ్ పీపుల్’, వీధి అవగాహన సమావేశం నిర్వహించారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 10 Oct 2026 8:34 PM IST
Kadiri
X

Kadiri: కదిరిలో పోలీసుల ‘వాక్ విత్ ప్రైడ్ అండ్ పీపుల్’

శ్రీ సత్య సాయి జిల్లా: కదిరి పట్టణంలో రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కుటాగుళ్ళ ప్రాంతంలో ప్రజా అవగాహన సమావేశం మరియు "Walk with Pride and People" కార్యక్రమాన్ని కదిరి పట్టణ పోలీసులు నిర్వహించారు.

కదిరి పట్టణ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ బి. వెంకటేశ్వర్లు ఈ రోజు కదిరి పట్టణంలోని కుటాగుళ్ళ ప్రాంతం (1, 2, 43, 44 వార్డులు) లో పర్యటించారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో వీధి సమావేశం (Street Corner Meeting) నిర్వహించి, ఎన్నికల సమయంలో ఎలాంటి హింసాత్మక చర్యలకు, గొడవలకు పాల్పడకుండా శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై, హింసకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు, రెచ్చగొట్టే పోస్టులు వ్యాప్తి చేయరాదని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనల గురించి వెంటనే పోలీసులకు గానీ, డయల్ 112 కు గానీ సమాచారం అందించాలని తెలిపారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI