Kadiri: కదిరిలో స్థానిక ఎన్నికల వీధి సమావేశాలు

Kadiri: కదిరిలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వీధి సమావేశాలు నిర్వహించారు. నియమావళి దాటితే కఠిన చర్యలని టౌన్ సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 14 Oct 2026 9:32 PM IST
Kadiri
X

Kadiri: కదిరిలో స్థానిక ఎన్నికల వీధి సమావేశాలు

కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా ఎస్.పి. ఎస్. సతీష్ కుమార్, ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు, కదిరి డి.ఎస్.పి. శివనారాయణ స్వామి పర్యవేక్షణలో, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా కదిరి టౌన్ పోలీసులు ఈ రోజు మూర్తిపల్లి మరియు నిజాంవలి కాలనీ ప్రాంతాలలో వీధి సమావేశాలు (స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్) నిర్వహించారు.

ఈ సందర్భంగా కదిరి టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజలు ఎలాంటి గొడవలు, ఘర్షణలు, హింసాత్మక సంఘటనలకు పాల్పడరాదని సూచించారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సామాజిక మాధ్యమాలలో వదంతులు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టరాదని, అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాల సమాచారాన్ని వెంటనే పోలీసులకు గానీ, డయల్ 112 కు గానీ తెలియజేయాలని కోరారు. ప్రజలందరూ స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకుని, ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో కదిరి టౌన్ ఎస్.ఐ.లు, సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI