Kadiri: 'వాక్ విత్ ప్రైడ్ అండ్ పీపుల్' కార్యక్రమం నిర్వహించిన పోలీసులు

Kadiri: కదిరిలో పోలీసులు 'వాక్ విత్ ప్రైడ్ అండ్ పీపుల్' కార్యక్రమం నిర్వహించారు. స్థానికుల సమస్యలు తెలుసుకుని, నేరాల నివారణపై అవగాహన కల్పించారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 8 Oct 2026 8:32 PM IST
Kadiri
X

Kadiri: 'వాక్ విత్ ప్రైడ్ అండ్ పీపుల్' కార్యక్రమం నిర్వహించిన పోలీసులు

కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, కదిరి డీఎస్పీ శ్రీ శివనారాయణ స్వామి పర్యవేక్షణలో కదిరి పట్టణంలోని బంగారు లక్ష్మన్న కాలనీలో *వాక్ విత్ ప్రైడ్ అండ్ పీపుల్"* కార్యక్రమాన్ని స్థానిక పోలీసులు నిర్వహించారు.

కదిరి టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కలిసి కాలనీలో పర్యటించి స్థానికులతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీలో *స్ట్రీట్ కార్నర్ మీటింగ్* ఏర్పాటు చేసి శాంతిభద్రతలు, నేరాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.

కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు గానీ, చట్టవ్యతిరేక కార్యకలాపాలు గానీ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. అత్యవసర సమయంలో *డయల్ 112*కు ఫోన్ చేయాలని సూచించారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI