Kadiri: కదిరిలో బీడీ కార్మికులతో ‘గల్లీలో చాయ్’: నిసార్ యాసీన్ ఖాన్
Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నిర్వహించిన ‘గల్లీలో చాయ్’ కార్యక్రమంలో బీడీ కార్మికులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు సిమ్స్ ఎండీ నిసార్ యాసీన్ ఖాన్.
Kadiri: కదిరిలో బీడీ కార్మికులతో ‘గల్లీలో చాయ్’: నిసార్ యాసీన్ ఖాన్
శ్రీ సత్యసాయి జిల్లా: కదిరిలో బీడీ కార్మికులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకునేందుకు ‘గల్లీలో చాయ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీడీ కార్మికులతో కలిసి చాయ్ తాగుతూ వారితో ఆప్యాయంగా మాట్లాడిన సిమ్స్ హాస్పిటల్ ఎండీ, NYPSN ఫౌండర్ బి. నిసార్ యాసీన్ ఖాన్ వారి కుటుంబ పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
బీడీ కార్మికుల సమస్యలను దగ్గరగా తెలుసుకుని, వారికి అవసరమైన సహాయం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని నిసార్ యాసీన్ ఖాన్ తెలిపారు. కార్మికులతో నేరుగా మమేకమై వారి కష్టాలను తెలుసుకోవడం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు నిసార్ యాసీన్ ఖాన్‌తో తమ సమస్యలను పంచుకున్నారు.




