Kadiri: బీడీ కార్మికుల కుటుంబానికి అండగా నిసార్ యాసీన్ ఖాన్

Kadiri: కదిరిలో బీడీ కార్మికుడి కుటుంబంలో నవజాత శిశువు జననం సందర్భంగా రూ.10 వేల ఆర్థిక సాయం అందించిన సిమ్స్ ఎండి నిసార్ యాసీన్ ఖాన్. మానవత్వానికి ప్రతీక.

P.RAHAMTULLA, KADIRI
Published on: 4 Nov 2026 8:47 PM IST
Kadiri
X

Kadiri: బీడీ కార్మికుల కుటుంబానికి అండగా నిసార్ యాసీన్ ఖాన్

కదిరి: సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని నిజాంవలీ కాలనీకి చెందిన బీడీ కార్డ్ హోల్డర్ కుటుంబంలో చిన్నారి జన్మించడంతో, ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా సిమ్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, NYPSN ఫౌండర్ బి. నిసార్ యాసీన్ ఖాన్ మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు.

బీడీ కార్మికుల కుటుంబాలకు ప్రతి కష్టసుఖాల్లో అండగా ఉంటూ, వారి సంక్షేమమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని నిసార్ యాసీన్ ఖాన్ తెలిపారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI