Kadiri: కదిరి మున్సిపాలిటీ అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి!
Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్పర్సన్ కాంగ్రెస్ అభ్యర్థి మఠం రామ శ్రీ లక్ష్మి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కదిరి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
Kadiri: కదిరి మున్సిపాలిటీ అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి!
Kadiri: తన గెలుపుకు ఒక్క అవకాశం ఇవ్వాలని సత్యసాయి జిల్లా కదిరి కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్ అభ్యర్థి మఠం రామ శ్రీ లక్ష్మీ కదిరి మున్సిపల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆమె భర్త మోహన్ గాంధీ మీడియా ప్రకటన విడుదల చేశారు. కదిరి పట్టణాన్ని శుభ్రంగా ఉంచడం కోసం, మున్సిపాలిటీ స్థితిగతులను మార్చడం కోసం ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిలమత్తూరు మోహన్ గాంధీ మాట్లాడుతూ తన సతీమణి మఠం రామ శ్రీ లక్ష్మి గారు కదిరి మున్సిపాలిటీ చైర్పర్సన్గా పోటీ చేస్తున్నారనీ, ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి ఆమెను గెలిపించాలని పట్టణ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మీ ఓటు కదిరి అభివృద్ధికి, శుభ్రమైన పట్టణానికి దారి చూపుతుందన్నారు.




