Kadiri: అనారోగ్యంతో ఉన్న మాజీ వైస్ చైర్మన్ పరామర్శ!
Kadiri: కదిరి మాజీ వైస్ చైర్మన్ రాజశేఖర్ ఆచారిని అనారోగ్యంతో నివాసంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పరామర్శించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Kadiri: అనారోగ్యంతో ఉన్న మాజీ వైస్ చైర్మన్ పరామర్శ!
Kadiri: సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాజశేఖర్ ఆచారి ఆరోగ్య సమస్యల కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ ఆచారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




